సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 8 (ప్రశ్న ఆయుధం న్యూస్): 2వ స్థానిక ఎన్నికలు 2025 – ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది సమయపాలన పాటించడం కీలకమని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) చంద్రశేఖర్ అన్నారు. బుధవారం గ్రామ పంచాయతీ ఎన్నికల స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ల ప్రక్రియపై మాస్టర్ ట్రైనర్ కృష్ణ ద్వారా కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికల స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారులను ఉద్దేశించి అదనపు కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించనున్నాయని, ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. నామినేషన్ల ప్రక్రియలో సమయపాలన కీలకమైన అంశం అన్నారు. రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల (నియమావళి) పాటించడం, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు,పోలింగ్ కేంద్రాల లో ఓటింగ్ ప్రక్రియ కు తగిన ఏర్పాట్లు పరిశీలన, పోలింగ్ కేంద్రాల వారిగా ఓటర్ల జాబితా సిద్ధం చేయడం, సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ రోజున జరిగే కౌంటింగ్ ప్రక్రియకు సరైన ఏర్పాటు చేయడం తదితర ఏర్పాట్లను ఎన్నికల విధిగా పర్యవేక్షించాలన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు సిబ్బంది తమ విధుల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండి ఎన్నికలు నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ల ద్వారా నామినేషన్ల దాఖలు పరిశీలన ఉపసంహరణ బ్యాలెట్ పేపర్ తయారీ తదితర అంశాలతో రిటర్నింగ్ అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, శిక్షణ నోడల్ అధికారి రామాచారి, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల విధుల్లో సమయపాలన కీలకం: అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
Published On: October 8, 2025 6:31 pm