సిద్దిపేట/గజ్వేల్, అక్టోబర్ 24 (ప్రశ్న ఆయుధం న్యూస్):దళిత సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ (టీజేయూ) జిల్లా అధ్యక్షుడు మరాఠీ కృష్ణమూర్తికి ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా చిప్పల యాదగిరి పొన్నల కుమారులు మాట్లాడుతూ.. ఐక్యంగా ఉంటే దళితులు అన్ని స్థాయిలకు ఎదుగుతారని, ఐక్యతే మన బలం, ఐక్యతే మనకు గౌరవం తెస్తుందని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన మరాఠీ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలతో పాటు బహుజనుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తాన్నారు. టీజేయూ ప్రతి విలేకరికి అండగా నిలుస్తుందని దళిత, బహుజన వర్గాల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని అన్నారు. నాయకులు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పొన్నాల కుమార్, డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి వేగొండ, దళిత సంఘాల ఐకాస రాష్ట్ర కార్యదర్శి చిప్పల యాదగిరి, సిఐటియు జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య, మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి, రాయపోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పుట్టరాజు, అభినవ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు శివకుమార్, డిబిఎఫ్ ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు తదితరులు పాల్గొన్నారు.
దళిత సంఘాల ఆధ్వర్యంలో టీజేయూ జిల్లా అధ్యక్షుడు మరాఠీ కృష్ణమూర్తికి ఘన సన్మానం
Published On: October 24, 2025 8:20 pm