సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఐఎఫ్‌డబ్ల్యూజే ఉపాధ్యక్షుడు డాక్టర్ పెద్దాపురం నరసింహ బావమరిది సాయిశరత్ నిశ్చితార్థ వేడుక భానూర్ ఫంక్షన్ హాల్‌లో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మరాఠీ కృష్ణమూర్తి, రాష్ట్ర నాయకులు గండ్ర నరేందర్‌లు కార్యక్రమంలో వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పెద్దాపురం నరసింహ కుటుంబ సభ్యులు అతిథులను సాదరంగా ఆహ్వానించారు. డాక్టర్ పెద్దాపురం నరసింహ జర్నలిస్టు సమాజంలో విశేష సేవలు అందిస్తూ, ఐఎఫ్‌డబ్ల్యూజే సంస్థలో ఉపాధ్యక్షుడిగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన కుటుంబంలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకలో పలువురు జర్నలిస్టు యూనియన్ సభ్యులు, మీడియా ప్రతినిధులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కప్పర ప్రసాద్ రావు మాట్లాడుతూ.. డాక్టర్ నరసింహ జర్నలిస్టు వర్గానికి ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తున్నారని, ఆయన కుటుంబంలో సంతోషకరమైన ఈ వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు.
సాయి శరత్ నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొన్న టీజేయూ అధ్యక్షుడు కప్పర ప్రసాద్ రావు
Published On: October 11, 2025 8:06 pm