సంగారెడ్డి, అక్టోబర్ 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): టీఎన్ జీవోఎస్ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు వెంకటేశం కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టీఎన్ జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు ఎం.డీ. జావీద్ అలీ, కార్యదర్శి రవి, అసోసియేట్ అధ్యక్షుడు కసిని శ్రీకాంత్, పి. వెంకటరెడ్డి, కోశాధికారి జి. శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ వి. విజయ్ కుమార్ తదితరులు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఎన్ జీవోఎస్ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన టీఎన్ జీవోఎస్ నాయకులు
Published On: October 26, 2025 2:33 pm