సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): హైదరాబాద్ ప్రజా భవన్ లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ విశ్వనాథన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (చిన్న ముదిరాజ్) బాలమురళీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, ఇంచార్జీలు పాల్గొని గ్రామ పంచాయతీలలో ప్రారంభమైన కొత్త పనులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను తమ దృష్టికి తీసుకురావాలని మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావులు సూచించారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎనికపై చర్చలు జరిగాయని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చిన్న ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, తెలంగాణ కార్పొరేషన్ చైర్మన్లు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా భవన్ సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న ముదిరాజ్
Updated On: August 23, 2025 10:43 pm