సంగారెడ్డి/పటాన్ చెరు, సెప్టెంబర్ 1(ప్రశ్న ఆయుధం న్యూస్): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసినందుకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు బీసీ బిడ్డల తరఫున టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలమురళీకృష్ణ (చిన్న ముదిరాజ్) ధన్యవాదాలు తెలిపారు. సోమవారం పటాన్ చెరులో విలేకరులతో మాట్లాడుతూ.. 10 ఏళ్ళు అధికారంలో ఉండి కేసీఆర్ బీసీలను అనగదొక్కారని, కేసీఆర్ చేసిన బీసీ బిల్లు బీసీలకు మరణ శాసనం అయ్యిందని అన్నారు. బీసీ కుల గణన చేసి పకడ్బందీగా బీసీ బిల్లు తెచ్చి బీసీలకు రాజకీయ సుస్థిర స్థానం కల్పిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీది తెలిపారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఆశయాల మేరకు జనాభా ప్రకారం వారి వాటా ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పని చేసిందన్నారు. కుల గణన చేపట్టామని, బీసీ కమిషన్ వేశామని, డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసి లెక్కలు తేల్చామని అన్నారు. అసెంబ్లీ, మండలిలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు చేస్తూ కాంగ్రెస్ బిల్లు చేసిందని చిన్న ముదిరాజ్ పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్లు అమలు చేసే ఘనత కాంగ్రెస్ పార్టీదే: టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న ముదిరాజ్
Published On: September 1, 2025 6:55 pm