*సంగారెడ్డిలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం*
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని టీపీసీసీ కార్యదర్శి తోపాజి అనంత కిషన్ డిమాండ్ చేశారు. మహిళలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి తోపాజి అనంత కిషన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను జీర్ణించుకోలేని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. తక్షణమే కేటీఆర్ మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జార్జ్, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి సంతోష్, మహిళా నాయకులు అనసూయ, జ్యోతి, వాణి, కౌన్సిలర్ నాగరాజు, నాయకులు రవి, శ్రీనివాస్, బాలు యాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.