భారత మాజీ ప్రధాన మంత్రి డా.మన్మోహన్ సింగ్ కు శ్రద్ధాంజలి

సంగారెడ్డి ప్రతినిధి, డిసెంబరు 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారత దేశ మాజీ ప్రధాన మంత్రి, ఆర్థిక చాణిక్యుడు అయిన డాక్టర్. మన్మోహన్ సింగ్ అనారోగ్య సమస్యలతో గురువారం కన్నుమూశారు. ఈ సందర్భంగా సదాశివపేట మండలం పరిధిలోని నిజాంపూర్ (కె) ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన సంతాప సభలో ప్రధానోపాధ్యాయుడు డా.పోట్రు.రామకృష్ణ, విద్యార్థులు డా.మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ భారతదేశానికి చేసిన సేవలను కొనియాడారు. 1932 సెప్టెంబర్ 26న జన్మించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత దేశానికి 13వ ప్రధాన మంత్రిగా మరియు అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా పని చేశారని, మన్మోహన్ సింగ్ సమాచార హక్కు చట్టంతో పాటు పలు సంస్కరణ చేశారని, 1991లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణ వలన భారతదేశ చరిత్రలో ముఖ్యుడిగా భావించబడ్డాడని తెలిపారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా 2004 నుండి 2014 మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా ” ది యాక్సిడెంట్ ల్ ప్రైమ్ మినిస్టర్ ” అని సినిమాను నిర్మించారని ఈ సినిమా 2019 వ సంవత్సరంలో విడుదలైందని అన్నారు. మన్మోహన్ సింగ్ ఆడమ్ స్మిత్ ప్రైజ్ ,కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయం-1956, పద్మ విభూషణ్- 1987, యూరో మనీ అవార్డు, 1993 ఉత్తమ ఆర్థిక మంత్రి, ఏషియా మనీ అవార్డు, ఆసియా కొరకు ఉత్తమ ఆర్థిక మంత్రి- 1993,1994, ఇందిరా గాంధీ బహుమతి 2017 వంటి పురస్కారాలు అందుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now