బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ కు నివాళులు

సంగారెడ్డి, ఏప్రిల్ 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. శనివారం సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు ప్రభుగౌడ్ మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ చేసినటువంటి సేవలను కొనియాడుతూ ఇప్పటికీ బడుగు బలహీన వర్గాలకు బీసీ వర్గాలకు తగిన న్యాయం జరగట్లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్లను పక్కాగా బీసీలకే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ స్వామిలు మాట్లాడుతూ.. అందరికీ సమాన న్యాయం జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కిష్టయ్య, కృష్ణ యాదవ్, జిల్లా నాయకులు చంద్రయ్య స్వామి, అశోక్, సుధాకర్ గౌడ్, జగదీశ్వర్, సంతోష్, గౌలీశ్వర్ వికాస్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment