గజ్వేల్ లో ముఖ్యమంత్రి అద్భుత చిత్రం ఆవిష్కరణ

సిద్దిపేట/గజ్వేల్, నవంబరు 8 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్బంగా రేవంత్ రెడ్డి చిత్రాన్ని వినూతనంగా పెసర పప్పును ఉపయోగించి అత్య అద్భుతంగా చిత్రాన్ని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రముఖ కళాకారుడు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఆవిష్కరించారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకునన్నారు. ఎందరో నాయకుల చిత్రాలను, భగవంతుని చిత్రాలను చిత్రించడం ఆ భగవంతుడు నాకు ఇచ్చిన ఓ గొప్ప కళ అని తెలిపారు. రామకోటి రామరాజు అద్భుత కళకు పలువురు అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment