“టూత్క్రీవ్ డెంటల్ కేర్” దంత వైద్యశాలను ప్రారంభించిన….వడ్డేపల్లి రాజేశ్వరరావు
ప్రశ్న ఆయుధం ఆగస్టు 24: కూకట్పల్లి ప్రతినిధి
కెపిహెచ్బి రోడ్ నెంబర్ – 4లో టూత్క్రీవ్ డెంటల్ కేర్ దంత వైద్యశాలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఈరోజు ఘనంగా ప్రారంభించారు. మిత్రుడు మధు ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా పాల్గొనీ రిబ్బన్ కట్ చేసి దంత వైద్యశాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా మధు మరియు వారి కుటుంబ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ని ఆహ్వానించి ఘనంగా సన్మానించారు.
“ప్రజలకు ఆరోగ్యం అత్యంత ప్రాధాన్యం. ముఖ్యంగా దంత సంబంధిత సమస్యలు ప్రతి కుటుంబంలోనూ ఎదురవుతున్నాయి. ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ డెంటల్ క్లినిక్ ప్రారంభం కావడం స్థానిక ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. మధు ఈ సేవా రంగంలో ముందుకు రావడం అభినందనీయమైన విషయం” అని వారు సేవలను స్థానిక కాలనీ ప్రజలు ఉపయోగించుకోవాలని వడ్డేపల్లి రాజేశ్వరరావు తెలియజేశారు.