సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): వాహనాల తనిఖీలు నిరంతరం కొనసాంగించి ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని నవ భారత్ నిర్మాన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు. కర్నూల్ బస్సు ప్రమాద ఘటనలో పలువురు మరణిచడంపై మెట్టు శ్రీధర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు ప్రమాదాలు జరిగినపుడే తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారని, నిరంతరం ఈ ప్రక్రియా కొనసాగకపోవడం కారణంగానే ప్రవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు బరితెగించి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నాయని మెట్టు శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు చెక్ పోస్టుల వద్ద సరైన తనిఖీలు లేక కేవలం ప్రయాణికులను తరలించాల్సిన బస్సులు ప్రమాదకర వస్తువులు స్మగ్లింగ్ గూడ్స్ ను తరలించడం పూర్తి అధికారుల వైఫల్యమేనని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు ప్రవేటు ట్రావేల్స్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని మెట్టు శ్రీధర్ కోరారు.
వాహనాల తనిఖీలు నిరంతరం కొనసాంగించాలి: నవభారత్ నిర్మాన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్
Published On: October 25, 2025 9:27 pm