ఆర్మూర్ బాలుర వసతి గృహంలో హాస్టల్ విద్యార్థులతో వెట్టి చాకిరి

ఆర్మూర్ బాలుర వసతి గృహంలో హాస్టల్ విద్యార్థులతో వెట్టి చాకిరి

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్ మచ్చేందర్*

ఆర్మూర్ ,డిసెంబర్, 25 (ప్రశ్న ఆయుధం) ఆర్.సి 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ వసతి గృహాలకు అట్లాగే విద్యాలయాలకు అనేక రకాలుగా ఖర్చు చేస్తున్న సందర్భంలో ఇలాంటి నిర్లక్ష్య దోపిడీ అధికారులు ఉండడం వలన ప్రభుత్వమిస్తున్నటువంటి నిధులను తమ ఖాతాలో వేసుకుంటూ ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని ప్రీ మెట్రిక్ విద్యార్థులతోని ఇలా వెట్టిచాకిరి చేయిస్తూ అనేక రకాలుగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తూ, వాళ్ల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. తల్లిదండ్రులు సుదూర ప్రాంతం నుండి తమ పిల్లల ఉజ్వలమైన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారు జిల్లాలు దాటి సంక్షేమ వసతి గృహాలలో చేర్పిస్తే ఇలాంటి అధికారులు విద్యార్థులకు విద్యాబోధన చేయించకుండా తమ సొంత ఇంటి వెట్టిచాకిరీ కి,హాస్టల్ చాకిరికి వినియోగించుకుంటున్నారు. 

అమ్మ నాన్న అన్నీ తానై విద్యార్థులను చూసుకోవాల్సిన ఆర్మూర్ ప్రభుత్వ బీసీ సమీకృత బాలురవసతి గృహ నిర్వహణ అధికారి విద్యార్థులను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం మనం వీడియోలో చూడవచ్చు. అసలే చలికాలం అందులోనూ ఎముకలను కొరికి వేసే ఇంతటి చలిలో వసతి గృహం లో నివసిస్తున్న విద్యార్థులను రెండంతస్తులపైన అత్యంత ప్రమాదకరంగా బిల్డింగ్ పైన అంచున ఉన్నటువంటి నీళ్ల ట్యాంకుల లోకి పిల్లలను దింపించి చదువుకోవాల్సిన వారిచే ట్యాంకులను శుభ్రం చేపిస్తుండడం అతని యొక్క దుస్సాహసాన్ని తెలియజేస్తుంది. ఏమరపాటున అక్కడనుండి పిల్లలు జారినచో కింద పడితే బ్రతకడం అనేది అసాధ్యం. అది తెలిసి కూడా వారిచే ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేపించడం అనేది అతని యొక్క నిర్లక్ష్య పూరితమైన విధి నిర్వహణను తెలియజేస్తుంది.

ఈ సంఘటన ఆర్మూర్ బీసీ బాలుర ఇంటిగ్రేటెడ్ వసతి గృహంలో జరిగిన సంఘటన ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మచ్చేందర్ పై గత కొన్ని సంవత్సరాలుగా అనేక ఆరోపణలు ఉన్నాయి. 

• వార్డెన్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న మచ్చేందర్ సరిగ్గా విధులకు హాజరు కావడం లేదని , విధి నిర్వహణ సమయంలో బయట కనబడడం వలన ప్రజలు పలు మార్లు ఆరోపించారు. 

• విద్యార్థులకు సంబంధించినటువంటి కాస్మోటిక్ చార్జెస్ ను ఇవ్వకుండా తన ఖాతాలో వేసుకున్నట్టు విద్యార్థులు తెలియజేశారు. 

• విద్యార్థుల పట్ల పరోక్షంగా పదజాలంతో బెదిరిస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. 

• పలుసార్లు విద్యార్థి సంఘాలతో ఇట్టి విషయాలపట్ల వాగ్వాదానికి దిగినట్టు సమాచారం ఇవ్వగా విద్యార్థి సంఘాల పైన దుర్భాషలాడినటువంటి సంఘటనలు కూడా వార్తల్లోకి వచ్చాయి. 

• గతంలో జిల్లా కేంద్రంలో వసతి గృహలలో ACB దాడులు కూడా జరిగినట్టు సమాచారం. 

• బియ్యం తరలింపులో కూడా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. 

• వసతి గృహంలో సరైన సదుపాయాలు లైట్లు, బాత్రూంలు సరిగ్గా ఉంచకపోవడం అంశాలు కూడా తెరమీదకి వస్తున్నాయి.

• గత ప్రభుత్వ మాజీ MLA అండదండలతో ఇలాంటి అక్రమాలు చేస్తున్నాడని ప్రజల ఫిర్యాదు మేరకు. 

• తాను నివసిస్తున్న ఇల్లు కూడా మామిడిపల్లిలోని ఒక వెంచర్లో పార్కు , ప్లేగ్రౌండ్ నిమిత్తం ఏర్పాటు చేసిన పది పర్సెంట్ భూమిలో ఉంది అని కాలనీవాసులు గత సంవత్సరం గొడవ చేయడం జరిగింది. 

• జిల్లాలో ఇలాంటి వార్డెన్ల పనితీరుపై గత సీనియర్ సివిల్ జడ్జి , జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ ఉదయ్ భాస్కర్ కూడా తనిఖీలు చేసిన మారని పరిస్థితి 

కావున ఇలాంటి అధికారుల నిర్లక్ష వైఖరి పట్ల అధికారిక యంత్రాంగం చర్యలు చేపట్టి వారిని విధులనుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాము.

Join WhatsApp

Join Now

Leave a Comment