టీజేయూ జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన జాగృతి నాయకులు

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ (టీజేయూ) జిల్లా కమిటీ సభ్యులను జాగృతి రాష్ట్ర కార్యదర్శి మురళి కృష్ణ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ సమాజంలోని సమస్యలను ప్రజల దాకా తీసుకెళ్లడంలో టీజేయూ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉద్యమాలను బలోపేతం చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతి, భాష, హక్కుల పరిరక్షణే జాగృతి లక్ష్యమని, యువత భాగస్వామ్యంతో మరింత బలమైన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ (టీజేయూ) జిల్లా అధ్యక్షుడు గిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులు పోచగౌడ్, మహేష్ గౌడ్, శివకుమార్, కార్యవర్గ సభ్యులు రాజేష్, గణేష్, జావీద్, లీగల్ అడ్వైజర్ సత్యనారాయణ గౌడ్, జాగృతి నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment