*ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న పంజా విజ‌య్‌కుమార్‌* *ఆస్పత్రిలో బాలుడికి చికిత్స చేయించిన విజయ్ కుమార్*

*ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న పంజా విజ‌య్‌కుమార్‌*

*నాలుగు గంట‌ల పాటు ఆస్ప‌త్రిలో బాధితుల‌కు అండ‌గా..*

*పంజా విజ‌య్ కుమార్ కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపిన త‌ల్లిదండ్రులు*

IMG 20240807 180630

మెదక్, ఆగస్టు 7 (ప్రశ్న ఆయుధం న్యూస్):ఇచ్చిన మాట ప్ర‌కారం నాలుగు గంట‌ల పాటు ఆస్ప‌త్రిలో ఉండి త‌మ కుమారుడికి ప్ర‌త్యేక చికిత్స అందేలా కృషి చేసిన బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్, నిజాంపేట మాజీ జెడ్పీటీసీ పంజా విజ‌య్‌కుమార్ కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపిన సంఘ‌ట‌న మెద‌క్ ప‌ట్ట‌ణంలో బుధ‌వారం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెలితే.. మెద‌క్ ప‌ట్ట‌ణానికి చెందిన కాస అరవీంద్‌కుమార్‌, ప్ర‌వ‌ళిక దంప‌తుల‌కు నేహాన్‌సాయి కుమారుడు. కాగా నేహాన్‌సాయి పుట్టుక‌తోనే డెవ‌ల‌ప్‌మెంట్ డిలే(బుద్ది మంధ్య‌త‌) లోపంతో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో త‌ల్లిదండ్రులు ఎన్నో ఆస్ప‌త్రుల‌కు తీసుకెళ్లినా, ఆర్థిక ప‌రిస్థితుల నేప‌థ్యంలో స‌రైన చికిత్స‌ను చేయించ‌లేక‌ పోయారు. కాగా గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీ ఇంటింటి ప్ర‌చారంలో భాగంగా నేహాన్‌ సాయికి ఉన్న లోపాన్ని త‌ల్లిదండ్రులు పంజా విజ‌య్‌కుమార్ దృష్టికి తీసుకెళ్ల‌గా, తాను త‌ప్ప‌కుండా ద‌గ్గ‌రుండి బాలుడికి చికిత్స చేయిస్తాన‌ని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్ర‌కారం బుధవారం నేహాన్‌ సాయికి సికింద్రాబాద్‌లోని ప్రైవేట్ ఆస్ప‌త్రిలో నాలుగు గంట‌ల పాటు నేహాన్‌సాయితో ఉండి డాక్ట‌ర్ల‌తో మాట్లాడి ప్ర‌త్యేక చికిత్స‌ను అందేలా పంజా విజ‌య్ కుమార్ కృషి చేశార‌ని త‌ల్లిదండ్రులు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వారు పంజా విజ‌య్‌కుమార్ కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా పంజా విజ‌య్ కుమార్ మాట్లాడుతూ… బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లకు తానెప్పుడు అండ‌గా ఉంటాన‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఎల్ల‌ప్పుడు కృషి చేస్తాన‌ని ఆయన హామీనిచ్చారు. వీరి వెంట నాయకులు ఉన్నారు.

Join WhatsApp

Join Now