నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి
మండపాల నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు పాటించాలి
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్
హుజురాబాద్ ఆగస్టు 26 ప్రశ్న ఆయుధం
సకల విజ్ఞాలను తొలగించే ఆదిదేవుని పండుగ పురస్కరించుకుని హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ తెలియజేశారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ వినాయక చవితి పురస్కరించుకొని మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు సుఖ,సంతోషాలతో,పాడిపంటలతో,ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ప్రణవ్ తెలిపారు మండపాలు నిర్వహించే నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ ఉత్సవాన్ని జరుపుకోవాలని ప్రజలను కోరారు.ప్రభుత్వం ఈ సంవత్సరం వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందజేస్తుందని తెలిపారు.