సంగారెడ్డి/పటాన్ చెరు, ఏప్రిల్ 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): గుమ్మడిదల సీనియర్ జర్నలిస్టు శేఖర్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న గుమ్మడిదల మండల కాంగ్రెస్ నాయకులు విప్ప రాంరెడ్డి 10వేల ఆర్థిక సహాయం అందజేశారు. బుధవారం గుమ్మడిదలలోని జర్నలిస్టు శేఖర్ నివాసానికి కాంగ్రెస్ నాయకులు విప్ప రాంరెడ్డి వెళ్లి పరామర్శించి ఆర్థిక ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స నిమిత్తం తనవంతుగా 10వేల రూపాయలను జర్నలిస్టు కుటుంబీకులకు అందజేశారు. వీరి వెంట నాయకులు విజేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
జర్నలిస్టు శేఖర్ కు ఆర్థిక సాయం అందజేసిన విప్ప రాంరెడ్డి
Published On: April 9, 2025 9:53 pm
