సంగారెడ్డి ప్రతినిధి, మే 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఈనెల 23న జహీరాబాద్ లో విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు లింగయత్ సమాజం నాయకులు తెలిపారు. ఆదివారం జహీరాబాద్ బసవ నగర్ బసవ మండపంలో విశ్వ గురు బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా లింగయత్ సమాజం నాయకులు మాట్లాడుతూ.. ఈ నెల 23న జహీరాబాద్ హుగ్గెల్లి కూడలి చౌరస్తాలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతులు మీదగా విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పరమపూజ శ్రీ. భల్కి పట్టాధ్యక్షులు మఠధీశులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, రాజకీయ ప్రముఖులు, లింగయత్ సమాజం పెద్దలు, ప్రజాప్రతినిధులు, బసవ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్. మాజీ చైర్మన్ ఇదులపల్లి శివ కుమార్, రాష్ట్రీయ బసవదల్ తెలంగాణ ప్రెసిడెంట్ కుసునూర్ శంకర్ పాటిల్, వీరశైవ లింగయత్ సంగారెడ్డి జిల్లా సమాజం అధ్యక్షుడు ఇప్పపల్లి నర్సింలు, వీరశైవ లింగయత్ సమాజం జహీరాబాద్ టౌన్ ప్రెసిడెంట్. రాజు శెట్కార్, రాష్ట్రీయ బసవదల్ జహీరాబాద్ టౌన్ ప్రెసిడెంట్ డా.శరణప్ప బలోడే, వీరశైవ లింగయత్ సమాజం జహీరాబాద్ టౌన్ కార్యదర్శి సుభాష్, ఆర్ వీఎల్ ఎల్ బీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్వర్ స్వామి, సంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి యువజన విభాగం పోలీస్ ప్రవీణ్ పాటిల్, నారాయణఖేడ్ రాష్ట్రీయ బసవదల్ టౌన్ ప్రెసిడెంట్ బిరదర్ నగేష్, సృజన పాటిల్, సురేష్ శెట్కార్, జిల్లా సమాజం సీనియర్ నాయకులు పోలీస్ మాణిక్ ప్రభు, బెండు చంద్రశేఖర్, అరుణ్, రాజు, బస్వరాజ్, నీలకంఠం స్వామి తదితరులు పాల్గొన్నారు.
విశ్వ గురు బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ కరపత్రాలు విడుదల
Updated On: May 18, 2025 9:11 pm
