ఐటీఐల్లో వాక్ఇన్ అడ్మిషన్లు
— కామారెడ్డిలో నాలుగో దశ ప్రవేశాలు ప్రారంభం
– సెప్టెంబర్ 30 వరకు అవకాశం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 16
కామారెడ్డి జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ఖాళీగా ఉన్న సీట్లను వాక్ఇన్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశాలు కొనసాగుతాయని బిచ్కుంద ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ ప్రమోద్‌కుమార్ రెడ్డి తెలిపారు.
ఎస్ఎస్సీ పాస్ అయిన కొత్త అభ్యర్థులు వెబ్సైట్లో నమోదు చేసుకొని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసిన వారు మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం లేదని, నేరుగా హాజరై సీటు పొందవచ్చని చెప్పారు. గత మూడు దశల్లో దరఖాస్తు చేసి సీటు పొందని వారు నేరుగా ప్రభుత్వ ఐటీఐ లేదా ఏటీసీకి వెళ్లి ప్రవేశం పొందవచ్చని తెలిపారు.
ఆన్లైన్ దరఖాస్తు తప్పనిసరి అని, ఇంటర్నెట్ సెంటర్లు అందుబాటులో లేని పక్షంలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో (ఎస్ఎస్సీ మెమో, కుల ధ్రువపత్రం, బోనఫైడ్, టీసీ, ఫోటోలు) ఐటీఐలోనే అప్లై చేసుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ http://iti.telangana.gov.in ను సందర్శించవచ్చు. ఫోన్ నంబర్లు 8500463363 / 9989946678 ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.