తెలంగాణ రాష్ట్రంలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
శనివారం నిజామాబాద్ జిల్లాలో ఈ సీజన్లోనే అత్యధికంగా 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యుడి తీవ్రతకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి.
నల్గొండ, NRML, సిద్దిపేట జిల్లాల్లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత, ADB, పెద్దపల్లి జిల్లాల్లో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
వాతావరణ శాఖ మార్గదర్శకాల ప్రకారం, 45 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైతే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
మరో 36 గంటల పాటు రాష్ట్రంలో ఇదే విధమైన అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా మధ్యాహ్న వేళల్లో బయట తిరగకుండా ఉండాలని సూచించారు.











