నర్సాపూర్ లో బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుకు ఘన స్వాగతం

IMG 20250718 131006
మెదక్/నర్సాపూర్, జూలై 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలకు నర్సాపూర్ లో నాయకులు ఘన స్వాగతం పలికారు. మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ లో బైక్ ర్యాలీ నిర్వహించి, చౌరస్తాలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళిధర్ యాదవ్, రాష్ట్ర, జిల్లా నాయకులు, మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు శక్తి కేంద్రం ఇన్చార్జులు, బూత్ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment