సంగారెడ్డి, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత యాత్రలో భాగంగా శుక్రవారం సంగారెడ్డికి వచ్చిన ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లకు నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బాలమురళీకృష్ణ (చిన్నా ముదిరాజ్), ఓబీసీ జిల్లా చైర్మన్ మవీన్ గౌడ్, డిసిసి జిల్లా ఉపాధ్యక్షుడు అరుణ్ గౌడ్ లు వారికి స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జనహిత యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతు బలంగా కూడగట్టుకుంటోందని, ప్రతి గ్రామానికి చేరుకొని ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలోనే బలమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని నాయకులు పేర్కొన్నారు.
మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ లకు స్వాగతం పలికిన నాయకులు
Published On: August 1, 2025 7:24 pm