సంగారెడ్డి జిల్లా భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎస్పీ చేతన

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా భరోసా కేంద్రాన్ని శుక్రవారం ఉమెన్స్ సేఫ్టీ వింగ్ ఎస్పి చేతన సందర్శించారు. ఈ సందర్భంగా చేతన భరోసా సెంటర్ రికార్డులను తనిఖీ చేశారు. ప్రతీ రికార్డును ఆన్ లైన్ చేయాలని సూచించారు. భరోసా సెంటర్ కు వచ్చిన బాధ్యత మహిళలకు అన్ని రకాల సేవలు ఒకే గొడవ కింద అందించే విధంగా చూడాలని భరోసా సిబ్బందికి సూచించారు. జిల్లా పోలీసు శాఖ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖలో తదితర శాఖల సమన్వయంతో బాధిత మహిళలకు సత్వర న్యాయం జరిగే విధంగా మెడికో, లీగల్ సేవలు అన్ని భరోసా సెంటర్లో నిర్వహించే విధంగా చూడాలని అన్నారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. పొక్సో, అత్యాచారా కేసులలో బాధితులను హక్కున చేర్చుకొని, వారిలో ధైర్యాన్ని నింపి, వారి సమస్యకు సత్వర పరిష్కారం దిశగా అన్నిరకాల సేవలను భరోసా సెంటర్ నందు అందించాలని అన్నారు. డ్యూటీ పరంగా ఎలాంటి సమస్యలున్న మా దృష్టికి తీసుకురావాలని, ఒక్కొక్క విభాగానికి చెందిన సిబ్బంది అందిస్తున్న సేవలను వివరంగా అడిగి తెలుసుకొని, తగు సలహాలు, సూచనలు చేశారు. షీ టీమ్ బృందాలు వివిధ స్కూల్స్, కళాశాలల వద్ద విద్యార్థుల భద్రతకై నిరంతరం గస్తీ కాస్తూ ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టాలని అన్నారు. ఈ విజిటింగ్ భరోసా నోడల్ అధికారి సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ సంజీవ రావు, ఇన్స్పెక్టర్ రామానాయుడు, భరోసా సెంటర్, షీ టీమ్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now