*వైభవంగా వరలక్ష్మి దేవి పూజలు*

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా గృహాలలో, ఆలయాలలో మహిళలు వరలక్ష్మీదేవి పూజలు ఘనంగా నిర్వహించారు. గృహాలలో లక్ష్మీదేవి విగ్రహాలను అలంకరించి, పూజలు చేశారు. అనంతరం ఒకరికొకరు మహిళలు పసుపు బొట్టు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now