సంగారెడ్డి, అక్టోబర్ 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగాలు, క్యారియర్ గైడెన్స్ సెల్ మరియు కామర్స్ విభాగం ఆధ్వర్యంలో జ్ఞాన ప్రబోధిని అనే స్వచ్ఛంద సంస్థ సహాయంతో యువతలో నైపుణ్య అభివృద్ధి అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. ప్రవీణ తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. యువత వివిధ అంశాలకు సంబంధించి అన్ని రకాల నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడే సమాజంలో రాణించగలుగుతారని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోలాపూర్ కి చెందిన జ్ఞాన ప్రబోధిని స్వచ్చంద సంస్థ జాయింట్ సెక్రెటరీ అమూల్ గాంగ్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటర్వ్యూను ఎదుర్కొనేటప్పుడు ఎటువంటి భాష, భావ ప్రకటన, హావ భావాలు వంటి నైపుణ్యాలు ఏ విధంగా సాధించాలి, అదేవిధంగా బయోడేటా తయారీలో ఎటువంటి మెలుకువలు పాటించాలి వంటి అంశాలను నాయకత్వ లక్షణాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ లో వివరించారు. జ్ఞాన ప్రబోధిని సంస్థకు మరియు కళాశాలకు ఉన్న అవగాహన ఒప్పందంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, భవిష్యత్తులో విద్యార్థులకు ఉపయోగపడే వివిధ రకాల కార్యక్రమాలను ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్, ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ జగదీశ్వర్, కామర్స్ విభాగధిపతి జ్యోతి, క్యారియర్ గైడెన్స్ సెల్ కన్వీనర్ డాక్టర్ కరుణ, ఇతర అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.