సిద్దిపేట/గజ్వేల్, అక్టోబర్ 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆవులకాడి పరశురాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గా భవాని వాటర్ ప్లాంట్‌ను మాజీ ఎంపీటీసీ ఆవులకాడి కిష్టయ్య శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, జిల్లా అధ్యక్షుడు మరాఠీ కృష్ణమూర్తి హాజరై మాట్లాడుతూ.. యువత స్వశక్తితో, స్వయం కృషితో ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని, ప్రజలకు శుద్ధమైన మంచినీటిని అందించడం సమాజ సేవలో భాగం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ గజ్వేల్ డివిజన్ అధ్యక్షుడు పొట్టోల్ల దాసు, మండల అధ్యక్షుడు డైరెక్టర్ పరశురాం, నిర్వాహకుడు ఆవులకాడి పరశురాం తదితరులు పాల్గొన్నారు.
యువత స్వశక్తితో ఎదగాలి: తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి
Published On: October 24, 2025 8:51 pm