ఈ నెల 5న గుమ్మడిదలలో రూట్ మార్చ్ కార్యక్రమం: సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి

సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆర్ఎస్ఎస్ స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఈ నెల 5న ఉదయం 10గంటలకు పదసంచలన్ (రూట్ మార్చ్) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ గత శతాబ్దం కాలంగా దేశ సేవలో విశిష్టమైన పాత్ర పోషించిందని, సామాజిక ఐక్యత, జాతీయతా భావన, దేశభక్తి విలువలను సమాజంలో పెంచేందుకు కృషి చేస్తోందని తెలిపారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పేందుకు, దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. గుమ్మడిదలలో జరగనున్న పదసంచలన్‌లో వందలాది మంది స్వయం సేవకులు పాల్గొని, ప్రదర్శన ద్వారా తమ సంఘటిత శక్తిని చూపించనున్నారని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment