మెదక్/నార్సింగి, అక్టోబర్ 4 (ప్రశ్న ఆయుధం న్యూస్):మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యలు పూజలు చేశారు. శనివారం దుర్గామాతను దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం యూత్ సభ్యులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ దాలే కృష్ణ మూర్తి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుమ్మరి బాబు, నాయకులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
నార్సింగిలో దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
Published On: October 4, 2025 1:41 pm