40వ వార్డులో లో–వోల్టేజ్ సమస్యలు తీవ్రం
కొత్త ఇళ్ల నిర్మాణం, అదనపు అంతస్తులతో విద్యుత్ లోడ్ పెరగడంతో ప్రజలు ఇబ్బంది
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 1
కామారెడ్డి పట్టణం 40వ వార్డులో లో–వోల్టేజ్ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీలో కొత్త ఇళ్ళు నిర్మాణం, పాత భవనాలపై అదనపు అంతస్తులు కట్టడంతో విద్యుత్ లోడ్ గణనీయంగా పెరిగి వోల్టేజ్ తగ్గుముఖం పడుతోందని తెలిపారు. ప్రస్తుతం హనుమాన్ టెంపుల్ వెనుక ఒక ట్రాన్స్ఫార్మర్, పాత గంప గోవర్ధన్ అన్న సతీష్ ఇంటి చౌరస్తాలో మరో ట్రాన్స్ఫార్మర్ మాత్రమే ఉండటంతో సమస్యలు మరింత పెరిగాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పార్సిరాములు ఫంక్షనల్ హాల్ వెనుక శివాలయం దగ్గర కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఎలక్ట్రిసిటీ AE కి జూలూరి సుధాకర్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కాలనీవాసుల తరఫున సమస్యలను AE కి మర్యాదపూర్వకంగా వివరించినట్లు తెలిపారు.