ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి 20 లక్షల రూపాయలు భూమి వితరణ 

ఆర్యవైశ్య బంధుమిత్ర ఆత్మీయ సమ్మేళనం

— ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి

— ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి 20 లక్షల రూపాయలు భూమి వితరణ

ప్రశ్న ఆయుధం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 29:

ఎల్లారెడ్డి నియోజకవర్గ ఆర్యవైశ్య బంధుమిత్రుల ఆత్మీయ సమ్మేళనం తాడ్వాయి మండలం అబ్దుల్ నగర్ లో పైడి ఎల్లారెడ్డి అతిథి గృహంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు, శాస్త్రవేత్త, పైడి ఎల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో ఆర్యవైశ్యుల కీలకపాత్ర పోషిస్తున్నారని, సమాజం పట్ల ఆర్యవైశ్యులు బాధ్యతగా వ్యవహరిస్తారని కొనియాడారు.

సంఘం అభివృద్ధికి పైడి ఎల్లారెడ్డి 20 లక్షల రూపాయలు లేదా 20 లక్షల విలువ గల భూమి నీ అందజేస్తానని ఆర్యవైశ్యులకు మాట ఇవ్వడం జరిగింది.సమాజంలో ఉండే నిరుపేద ప్రజలకు నా వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కంచర్ల బాలకృష్ణ గుప్తా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు నాగభూషణం గుప్తా, సుదర్శన్ గుప్తా ,రాములు గుప్తా, లింగం గుప్తా, గంగా చరణ్ గుప్తా, రాజు గుప్తా, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment