పటాన్‌చెరులో మాదిరి ప్రిథ్వీరాజ్ ఆధ్వర్యంలో 2కె రన్..

IMG 20250815 133545
సంగారెడ్డి/పటాన్‌చెరు, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్‌చెరు పట్టణంలో ఎండీఆర్ ఫౌండేషన్ కో-పౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ ఆధ్వర్యంలో 2కె రన్ “పొల్యూషన్ ఫ్రీ పటాన్‌చెరు” కార్యక్రమం శుక్రవారం ఉత్సాహంగా నిర్వహించారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాదిరి ప్రిథ్వీరాజ్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. పటాన్‌చెరు, బీరంగూడ, రుద్రారం, ముత్తంగి, వివిధ పరిశ్రమ ప్రాంతాల నుండి వచ్చిన వందలాది మంది పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పర్యావరణ హిత నినాదాలతో పాల్గొన్న పిల్లలు కార్యక్రమానికి చైతన్యం నింపారు. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ.. మన ప్రాంతంలో పెరుగుతున్న పారిశ్రామిక మరియు వాహన కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన పెంచి, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు. వృక్షారోపణ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, శుభ్రత నిర్వహణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం తప్పనిసరి అని అన్నారు. అలాగే ప్రతీ పౌరుడు పర్యావరణ పరిరక్షణలో తనవంతు బాధ్యతను నిర్వర్తించాలని, కాలుష్య రహిత పటాన్‌చెరు కోసం మనం తీసుకుంటున్న చర్యలకు సమాజం కూడా తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గుడెం మధుసూదన్ రెడ్డి, అందరి అశోక్ గారు పోచారం కృష్ణ, ఆంజనేయులు, శాంతినగర్ అసోసియేషన్ అధ్యక్షుడు అంజిరెడ్డిలు పాల్గొన్న వారందరికీ ధ్రువపత్రాలు, మొక్కలు అందజేశారు. చిన్నారులు పర్యావరణంపై నినాదాలు చేస్తూ పాదయాత్రలో చురుకుగా పాల్గొన్నారు. చివరగా, ప్రిథ్వీరాజ్ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో  యువత, మహిళలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, పరిశ్రమల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment