ఎర్ర పహాడ్ గ్రామంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం
కామారెడ్డి జిల్లా తాడ్వాయి
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 22 :
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తాడ్వాయి పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. టి. మురళి అన్నారు. శుక్రవారం రోజున ఎర్ర పహాడ్, గ్రామంలో టీఎస్ రమేష్‌రావు, కళాబృందంతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్.ఐ. మురళి మాట్లాడుతూ –
“ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. బైక్‌పై ఇద్దరికంటే ఎక్కువ మంది ప్రయాణించరాదు. మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం నడపకూడదు. కారు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పేట్టుకోవాలి. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి” అని సూచించారు.
కళాజాత బృందం పాటలతో, సంభాషణలతో, ప్రజలకు రోడ్డు భద్రతా అంశాలపై చైతన్యం కల్పించింది. గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.