ఉపాధి హామీ పనుల జాతర కార్యక్రమం
కామారెడ్డి జిల్లా తాడ్వాయి
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 22
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధి హామీ పనుల జాతర శుక్రవారం రోజున తాడ్వాయి, మండలంలో అంగరంగ వైభవంగా జరిగింది. మండలంలోని అన్ని 18 గ్రామపంచాయతీలలో ఒకేసారి పనులు ప్రారంభం కాగా, నూతన పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
మండల ప్రత్యేకాధికారి శివకుమార్ ఆధ్వర్యంలో తాడ్వాయి, గ్రామంతో పాటు బ్రహ్మాజీవాడి, కన్కల్,గ్రామాల్లో పశువుల పాక నిర్మాణం, ప్రారంభమైంది. అంతేకాకుండా అన్ని గ్రామాల్లో పశువుల పాకలు, ఇంకుడు గుంతల నిర్మాణానికి శంకుస్థాపనలు చేయడం ద్వారా ఉపాధి హామీ పనులు విస్తృతంగా కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో ఉపాధి హామీ పనుల్లో విశిష్టంగా పనిచేసిన గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు, అలాగే దివ్యాంగ ఉపాధి కూలీలను సన్మానించడం విశేషం.
కార్యక్రమంలో ఎంపీడీవో సాజిద్ అలీ, ఎంపీఓ, ఏపీవో కృష్ణగౌడ్, టీఏ స్వామి, పంచాయతీ కార్యదర్శులు, క్షేత్ర సహాయకులు, పాల్గొన్నారు. అలాగే స్థానిక ప్రజా ప్రతినిధులు, కూడా పెద్ద సంఖ్యలో హాజరై జాతర విజయవంతంగా ముగియడానికి తోడ్పడ్డారు.
ఇట్టి కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ అభివృద్ధి, పేద కుటుంబాల జీవనోపాధి మెరుగుపడుతోందని, పేర్కొన్నారు.