తాడ్వాయి రోడ్డుపై గుంతలు పూడ్చిన పోలీసులు

తాడ్వాయి రోడ్డుపై గుంతలు పూడ్చిన పోలీసులు

 

కామారెడ్డి జిల్లా తాడ్వాయి, (ప్రశ్న ఆయుధం)ఆగస్టు 25

 

తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్స్‌ సుదర్శన్‌, సామ్రాట్‌, నిరంజన్‌, అనిల్‌,తో పాటు హోం గార్డ్‌ దేవి సింగ్‌, ప్రజాసేవలో భాగంగా ప్రత్యేకంగా ముందుకొచ్చారు. తాడ్వాయి నుండి ఎర్రాపహాడ్‌ దారిలో ప్రధాన రహదారి పై ఏర్పడిన ప్రమాదకర గుంతలను స్వయంగా పూడ్చి వాహనదారులకు సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించారు.

ఇటీవల వర్షాల కారణంగా రహదారిపై గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం గుర్తించిన తాడ్వాయి పోలీస్ సిబ్బంది, యంత్రాంగంపై ఆధారపడకుండా స్వయంగా శ్రమించి గుంతలు పూడ్చడం స్థానికుల్లో ప్రశంసల పొందింది.

“పోలీసులు చట్టవ్యవస్థ మాత్రమే కాకుండా సమాజం కోసం కూడా శ్రమిస్తున్నారని ఇది నిదర్శనం” అని గ్రామస్థులు, మరియు వాహనాదారులు, అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment