సైబర్ నేరాల నివారణకు – అవగాహనే ప్రధాన ఆయుధం

*”సైబర్ నేరాల నివారణకు – అవగాహనే ప్రధాన ఆయుధం”*

 

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 11

 

 

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ నియంత్రణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిధిలో విధులు నిర్వహిస్తున్న సైబర్ వారియర్స్ అందరికీ ఈ కార్యక్రమంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, హైదరాబాద్ వారు అందించిన టీ-షర్టులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేశ్ చంద్ర, ఐపి‌ఎస్ మాట్లాడుతూ—

• నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రతి పోలీస్ సిబ్బంది ఈ రంగంలో పూర్తి అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరం.

• సైబర్ నేరాలను అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం అభివృద్ధి చేసుకోవాలి.

• ప్రతి కేసును సీరియస్‌గా తీసుకుని బాధితులకు త్వరితగతిన న్యాయం జరగేలా చర్యలు తీసుకోవాలి.

• ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్ నేరాలపై నిపుణుల బృందం ప్రజలకు మార్గదర్శనం చేయాలి.

• ప్రజలకు తరచుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

• 1930 నంబర్ లేదా www.cybercrime.gov.in ద్వారా వెంటనే ఫిర్యాదు చేయాలనే విషయాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజేయాలి.

• సైబర్ నేరాల్లో గోల్డెన్ అవర్ ఎంతో కీలకం. మోసానికి గురైన వెంటనే సమాచారం ఇస్తే, డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

• తెలియని వ్యక్తులకు OTPలు చెప్పవద్దు, తెలియని లింకులు లేదా అప్లికేషన్లు మొబైల్‌లో వినియోగించవద్దు, సోషల్ మీడియా ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

ఇట్టి కార్యక్రమంలో, ఎల్లారెడ్డి డిఎస్పి యస్ శ్రీనివాస్ రావు, సైబర్ క్రైమ్ జిల్లా నోడల్ ఆఫీసర్ టి. శ్రీధర్ మరియు సైబర్ వారియర్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now