ఎల్లారెడ్డిలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఆర్డీఓ ఆకస్మిక తనిఖీ

*ఎల్లారెడ్డిలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఆర్డీఓ ఆకస్మిక తనిఖీ*

 

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 11( ప్రశ్న ఆయుధం):

 

గౌరవ ఆర్డీఓ ఎల్లారెడ్డి శ్రీ పార్థసింహ రెడ్డి గారు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ప్రతి రోజు భుజిస్తున్న భోజనం, బెడ్స్, బెడ్ షీట్స్, స్టోర్ రూమ్ పరిశీలించి, పాఠశాల మొత్తం కలియదిరిగారు. అనంతరం ప్రిన్సిపల్‌కు శానిటేషన్ మెరుగుపరచాలని సూచనలు చేశారు.

 

ఈ సందర్భంగా మత్తమాల పిహెచ్‌సి సిబ్బంది స్కూల్ ప్రాంగణంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి, 24 మందికి చికిత్స అందించి, సామాన్య రుగ్మతలకు మందులు పంపిణీ చేశారు. అలాగే విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు.

 

ఆర్డీఓ గారు మాట్లాడుతూ, ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని ప్రతి గ్రామం, ప్రతి తండా, అలాగే పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో హెల్త్ క్యాంపులు నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు. ఎక్కడా అనారోగ్య సమస్యలు రాకుండా సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

 

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డివిజన్ సామాజిక ఆరోగ్య అధికారి జి. ఠాగూర్, సబ్ యూనిట్ అధికారి పాశం గోవిందరెడ్డి, మండల ఆరోగ్య పర్యవేక్షకులు జనార్దన్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ రాణి, ఎం.ఎల్.హెచ్‌.పి సంతోష్, స్థానిక ఆరోగ్య కార్యకర్త ఇందిరా మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now