ఎల్లారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో కార్యశాల* 

*ఎల్లారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో కార్యశాల*

 

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 11(ప్రశ్న ఆయుధం):

 

ఎల్లారెడ్డి పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో, రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా చేపట్టబోయే సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు ఒక కార్యశాలను నిర్వహించారు.

 

ఈ కార్యక్రమాన్ని ఎల్లారెడ్డి గాంధీచౌక్ వద్ద గల (SVR) కంప్యూటర్ సెంటర్‌లో నిర్వహించారు. రాబోయే వేడుకల్లో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం, బూత్ స్థాయిలో మొక్కల నాటకం, రక్తదాన శిబిరం వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన చర్యలపై ఈ కార్యశాలలో చర్చించారు.

 

ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మర్రి బాలకిషన్, పట్టణ అధ్యక్షులు అగల్ దివిటీ రాజేష్, ప్రధాన కార్యదర్శులు కుచులకంటి శంకర్, శ్రీను, మహిళా మోర్చా అధ్యక్షురాలు సుజాత, మాజీ ఎంపీపీ నక్క గంగాధర్, సీనియర్ నాయకులు ప్యాలాల రాములు, కుచులకంటి సతీష్, మ్యతరి సాయిలు, ఉపాధ్యక్షులు వంగపల్లి కాశీనాథ్, అల్లం పండరి, జనుముల పోచయ్య, కార్యదర్శులు మామిడి రమేష్, శివ, యువ నాయకులు జంగ శివ తదితరులు పాల్గొన్నారు.

 

నేతలు మాట్లాడుతూ రాబోయే కార్యక్రమాలను ప్రతి బూత్ స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు అందరూ కలసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now