మరికాపేపట్లో తేలనున్న ప్రియాంక గాంధీ భవితవ్యం!
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ కేరళలోని వయనాడ్ ఎంపీగా లోక్సభకు పోటీ చేసిన విషయం తెలిసిందే. తన సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామాతో వయనాడ్కు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆ స్థానం నుంచి ప్రియాంక పోటీ చేశారు. ఈ ఉప ఎన్నిక ఫలితం మరికాసేపట్లో వెలువడనుంది. వయనాడ్లో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తిస్థాయి ఫలితం వెలవడే అవకాశం ఉంది.