గిరిజన విద్యార్థిని శైలజ మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి

*గిరిజన విద్యార్థిని శైలజ మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి*

–బీఆర్ఎస్వీ జిల్లా నాయకులు రావుల రాజు, కొరివి తిరుపతి

ఇటీవల కొమురం భీం -ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో అక్టోబర్ 29న ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురై గత కొన్ని రోజులుగా నిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన విద్యార్థిని శైలజ మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్వీ సిద్దిపేట జిల్లా నాయకులు రావుల రాజు, కొరివి తిరుపతి అన్నారు. గురుకుల పాఠశాల విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని, ఈ ప్రభుత్వం వచ్చాక అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చిందని మండిపడ్డారు. గిరిజన విద్యార్థిని మృతికి బాధ్యత వహించి, ఆమె కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొర్ర సురేష్ కుమార్, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షులు చాతవేణి మహేష్, బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు బిగుల్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now