పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటుడు సుబ్బరాజు
టాలీవుడ్ నటుడు పెనుమత్స సుబ్బరాజు పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. పెళ్లి బట్టలు ధరించి, తన భార్యతో కలిసి బీచ్‌లో దిగిన ఫొటోను ఇన్‌స్టా వేదికగా ఆయన అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ విషయం తెలియడంతో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన వారితో పాటు అభిమానులు కొత్త జంటకు విషెస్ తెలియజేస్తున్నారు. కానీ వధువుకు సంబంధించిన విషయాలను ఆయన తెలియజేయలేదు.