బాల్య వివాహాలను నిర్మూలించాలి

*బాల్య వివాహాలను నిర్మూలించాలి*

కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి*

*బాల్య వివాహాల నిర్మూలనకు అందరి సహకార అవసరం*

*జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్*

శ్రీకాకుళం : 

బాల్య వివాహాలను నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి తెలిపారు. బుధవారం ఢిల్లీ నుండి ఆమె వర్చువల్ విధానంలో నిర్వహించిన “బాల్ వివాహ్ ముక్త్ భారత్” కార్యక్రమానికి శ్రీకాకుళం ఎన్ఐసి నుండి జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ హాజరయ్యారు. 

కార్యక్రమంలో భాగంగా అన్నపూర్ణా దేవి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాల్య వివాహ ముక్త్ భారత్ లక్ష్యం అన్నారు. పిల్లలు ఎదగడానికి, వృద్ధి చెందడానికి సురక్షితమైన వాతావరణం అవసరమన్నారు. దేశ వ్యాప్తంగా బాల్య వివాహాలను నిర్మూలించడానికి, ప్రయత్నాలను ముమ్మరం చేయడంలో భాగంగా కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి చేతుల మీదుగా “బాల్ వివాహ్ ముక్త్ భారత్” క్యాంపెయిన్ ను బుధవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బాల్యవివాహాలు నిర్మూలనకు అసాధారణ కృషి చేసిన కొందరు వ్యక్తులతో, బాల్యవివాహాలు ఎదుర్కోని విజయం పొందిన ఎంపిక చేసిన 9 మంది పిల్లలతో వర్చువల్ గా వారి అనుభావలను కేంద్ర మంత్రితో మాట్లాడారు. బాల్యవివాహాలు ఎదుర్కోవడంలో వారి విజయాల గురించి మాట్లాడటానికి ఎంపిక చేసిన 9 మంది పిల్లలలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుంచాల కురమయ్యపేట గ్రామానికి చెందిన బుచ్చ రమణమ్మతో మంత్రి వర్చువల్ గా మాట్లాడారు.

బుచ్చ రమణమ్మ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా తనకు 14 సంవత్సరాల వయస్సులో వివాహం చేశారని, సదరు విషయం సమగ్ర బాలల పరిరక్షణ విభాగం, శ్రీకాకుళం వారికీ తెలిసి తన తల్లిదండ్రులకు పలుమార్లు కౌన్సిలింగ్ నిర్వహించి వివాహంను రద్దు చేయించారని, ప్రస్తుతం బి.టెక్ చదువు పూర్తీ చేసుకొని, ఐటి సొల్యూషన్ కంపెనీ, హైదరాబాద్లో జాబ్ చేస్తూ, మరెంతో మంది బాలికలకు తన అనుభవాల ను పంచుకుంటూ, బాల్య వివాహాలు నిర్మూలనకు తనవంతుగా సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నానన్నారు.

*బాల్య వివాహాల నిర్మూలనకు అందరి సహకార అవసరం*

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ హాజరైన అందరితో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించి అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు దేశంలో ఒక పెద్ద సమస్య ఈ సమస్యను ఆదిగమించడానికి అందరి సహకారం అవసరమన్నారు. బాల్య వివాహల కారణంగా వారి జీవితాల్లో పెను మార్పులు ఉత్పన్నమవుతాయన్నారు.

ఈ వర్చువల్ సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి శాంతిశ్రీ, పిఓ ఎం.మల్లేశ్వర రావు, పి ఓ ఐ.ఎల్. నాయుడు వివిధ కళాశాలల నుండి విద్యార్థినులు, ఒన్ స్టాప్ సెంటర్ కోఆర్డినేటర్ హిమబిందు, కార్యాలయ సిబ్బంది తదితరులు హాజరైయారు.

Join WhatsApp

Join Now