మృతి చెందిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ప్రొసీడింగ్ కాపీలను అందజేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

*మృతి చెందిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ప్రొసీడింగ్ కాపీలను అందజేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్*

జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్ లో జగిత్యాల నియోజకవర్గం చెందిన 8 మంది గల్ఫ్ కార్మికులు గల్ఫ్ లో మరణించగా వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 40లక్షల రూపాయల విలువగల ప్రొసీడింగ్ కాపీలను భాధిత కుటుంబ సభ్యులకు అందజేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్.

ఎమ్మెల్యే మాట్లాడుతూ….

తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ కి వెళ్ళే వారి సంఖ్య ఉత్తర తెలంగాణ,జగిత్యాల నుండి అత్యదికం.గత ప్రభుత్వాన్ని అనేక మార్లు గల్ఫ్ సంఘాల,ఎన్ ఆర్ ఐ సంఘాలు నివేదించిన పట్టించుకోలేదు.ముఖ్యమంత్రి గల్ఫ్ కార్మికుల భాధలను అర్థం చేసుకొని 5 లక్షలు అందజేయటం వల్ల వారి కుటుంబాలు ఆర్థికంగా కొంత భరోసా ఇచ్చారు.ప్రజా భవన్ లో ఎన్ ఆర్ ఐ సెల్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వం 4 ఏండ్ల లో 16 వేల కోట్లు రుణ మాఫీ చేస్తే,నేడు కాంగ్రెస్ ప్రభుత్వం లో ఏకకాలం లో 18 వేల కోట్లు రుణ విముక్తి చేయటం జరిగింది.గత ప్రభుత్వం లో అమలు చేసిన సంక్షేమ పథకాలు తో పాటు ఆరు గ్యారంటీ లు అమలు చేస్తున్నాం అన్నారు ఎమ్మెల్యే.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జ్యోతి లక్ష్మణ్,కెడిసిసి జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రాంచందర్ రావు,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,నాయకులు గన్నె రాజీ రెడ్డి,కోల శ్రీనివాస్,రవీందర్ రావు,నారపాకా రమేష్,కౌన్సిలర్ లు బాలే లత శంకర్,పద్మ పవన్,కప్పల శ్రీకాంత్,నాయకులు శ్రీనివాస్ రావు,తిరుపతి గౌడ్,కొలగానీ సత్యం,ప్రవీణ్ రావు,పవన్,అంజన్న,ముఖేధ్,శీలంరమేష్, గోపి,రాజేశం,ప్రవీణ్,సురేందర్,జాన్,మండల,గ్రామ,వార్డు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now