*చేర్యాలలో రెవెన్యూ డివిజన్ సాధిస్తాం*
*జేఏసీ ఆధ్వర్యంలో సంకల్ప దీక్ష*
*మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వాగ్దానం*
చేర్యాల : చేర్యాల పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ జరిగిన చేర్యాల రెవెన్యూ డివిజన్ సంకల్ప దీక్షను జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ళ నిర్వహించారు పార్టీల ఎజెండా కాదు ప్రజల ఎజెండాయే చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించాలి అని జేఏసీ చైర్మన్ డా.ఆర్ పరమేశ్వర్ అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేర్యాల ప్రాంత ప్రజల ఎజెండా , ఆకాంక్ష ను సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడమే దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు.
డిసిసి అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్ రేవంత్ రెడ్డి దృష్టిలో ఉన్నదని దానిని సాధించడానికి జెఎసి సభ్యులను తీసుకువెళ్తానని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి తప్పకుండా చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధిస్తామని వాగ్దానం చేశారు ఎంతో ఘన కీర్తి చాటుకున్నటువంటి చేర్యాల ప్రాంతం నియోజకవర్గం కోల్పోవడంతో అస్తిత్వమే ప్రశ్నర్థకంగా మారిందన్నారు. చేర్యాల కు పూర్వ వైభవం తీసుకురావడం కోసం వివిధ పార్టీల నాయకులు కుల సంఘాలు నాయకులు కలిసి పని చేస్తామని అన్నారు కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ మద్దూరు జెడ్పిటిసి గిరి కొండల్ రెడ్డి, జేఏసీ నాయకులు పూర్మా ఆగం రెడ్డి అందె బీరయ్య, కొమ్ము నర్సింగరావు దాసరి కళావతి అందే అశోక్ కౌన్సిలర్లు ఆడెపు నరేందర్ చెవిటి లింగం కుల సంఘాల నాయకులు మల్లిగారి యాదగిరి బుట్టి సత్యనారాయణ జేఏసీ నాయకులు కొమ్ము రవి గద్దల మహేందర్ మ్యాక మల్లేశం, బందీగ రాకేష్ కృష్ణ, పాల లక్ష్మీ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 12