అటవీ సంపదను కాపాడేందుకు సమిష్టిగా పోరాడుదాం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్

మెదక్/నర్సాపూర్, మార్చి 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): గుమ్మడిదల మండలం ప్యారానగర్ లో డంపుయార్డు ఏర్పాటు చేయడం వల్ల అడవి పూర్తిగా విషతుల్యమవుతుందని, అటవీ సంపదను కాపాడేందుకు అందరం సమిష్టిగా పోరాడాలని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ తెలిపారు. గురువారం నర్సాపూర్ లో రిలే నిరాహార దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వాల్దాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ.. ప్యారానగర్ లో డంపు యార్డు ఏర్పాటు చేయడం వల్ల అడవి పూర్తిగా విషతుల్యమవుతుందని, ప్రకృతి సమతుల్యతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, డంపుయార్డు ఏర్పాటుతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలిపారు. అటవీ సంపదను కాపాడేందుకు అందరూ ఒక్కటిగా పోరాడాలని, ఈ నిరాహార దీక్ష ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తామని మల్లేష్ గౌడ్ అన్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ ఎల్లప్పుడూ ప్రజల వెంటే ఉంటుందని, అవసరమైతే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డంపుయార్డు ఏర్పాటును అడ్డుకుంటామని, ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని మల్లేష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రమేష్ గౌడ్, మిర్యాల చంద్రశేఖర్ గుప్తా, దిగంబరు, సుబ్రహ్మణ్యం, సంగసాని రాజు, బాల్ రాజ్, గుండం శంకర్, నారాయణ రెడ్డి, సంగమేశ్వర్, శ్రీకాంత్ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment