మెదక్/నర్సాపూర్, మార్చి 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. నర్సాపూర్ లోని కళాశాల మైదానం, ధర్మశాల ఎదురుగా ఆనందంగా నృత్యం చేసుకుంటూ హోలీ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షటిల్ అసోసియేషన్, క్రికెట్ క్రీడాకారులు, వాకింగ్ సభ్యులు తదితరులు హోలీ పురస్కరించుకొని, ఆనందంగా రంగులు చల్లుకుంటూ.. ఉత్సాహంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదేవిధంగా పట్టణ షటిల్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త శ్రీనివాస్ గౌడ్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.