సంగారెడ్డి/పటాన్ చెరు, మార్చి 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్‌చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదలలో డంపుయార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ 38 రోజులుగా నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ప్యారానగర్‌లో డంపుయార్డు ఏర్పాటు చేయొద్దని డిమాండ్ జేఏసీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని గుమ్మడిదల రిలే నిరాహార దీక్ష శిబిరంలో జేఏసీ నాయకులు, గ్రామస్తులు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం డంపుయార్డు రద్దు చేయాలని, 38 రోజులుగా ప్రజలు దీక్షలు చేస్తూ ఉన్నా.. అధికారుల నుంచి స్పందన లేకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోతే నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. హోలీ వేడుకల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఒకరికొకరు రంగులు చల్లుకున్నారు.
గుమ్మడిదల రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద హోలీ సంబరాలు
Published On: March 14, 2025 10:59 am
