సంగారెడ్డి, మార్చి 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి ఆర్టీసీ కాలనీలో శ్రీరామ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శ్రీరామ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మాణిక్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ స్వామి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై హోలీ ఉత్సవాలను ఉల్లాసంగా జరుపుకున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మాణిక్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ స్వామిలు మాట్లాడుతూ.. హోలీ పండుగ సామాజిక ఐక్యతకు నిదర్శనం అని, మత, కుల భేదాలను మరచి, అందరూ కలిసి స్నేహభావంతో జరుపుకోవాల్సిన పండుగ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్, సురేష్ గౌడ్, సహ కార్యదర్శి మల్లేశం, కోశాధికారి రాజేంద్రప్రసాద్, ఆర్గనైజేషన్ సెక్రటరీ సత్యనారాయణ, పరశురాం, రఘురామరాజు, విట్టల్ రెడ్డి, సలహాదారులు రాములు, ప్రభు, యాదయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి ఆర్టీసీ కాలనీలో ఘనంగా హోలీ సంబరాలు
Published On: March 14, 2025 8:01 pm
