ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు1
కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
మణుగూరు ఏరియా ఓసి-2 రిలే సి స్పెషల్ గ్రేడ్ షావెల్ ఆపరేటర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన గోశిక కుమారస్వామి మణి దంపతులను పీవీ కాలనీ గోల్డెన్ ఫంక్షన్ హాల్ లో అధికారులు ఏరియా కార్మిక సంఘాల నాయకులు ఏఐటీయూసీ,ఐ ఎన్ టి యు సి,టీబీజీకేఎస్, సిఐటియు, హెచ్ఎంఎస్ ,ఐ ఎఫ్ టి యు మరియు సహోద్యోగులు బంధుమిత్రుల ఆధ్వర్యంలో శాలువా పూలమాలలు జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఓసి-2 మేనేజర్ కే సురేష్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ షావేల్ ఆపరేటర్ గా పనిలో అంకితభావంతో, తోటి ఉద్యోగులతో స్నేహభావంతో పాటు సింగరేణి క్రీడాకారునీగా (వెయిట్ లిఫ్టర్) రాష్ట్ర, జాతీయస్థాయిలో పలు బహుమతులు సాధించి సింగరేణి ప్రతిష్టను ఇనుమడింపజేసిన కుమారస్వామి సేవలు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు అనంతరం కుమారస్వామి విశ్రాంత జీవితం ఆనందమయం కావాలి ఆకాంక్షిస్తూ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓసి- 2 అడిషనల్ మేనేజర్ రిలే సి ఇన్ చార్జ్ భూక్య భాoగ్య, ఇంజనీర్ శంకర్ కార్మిక సంఘాల నాయకులు వై రాంగోపాల్, వత్సవాయి కృష్ణంరాజు, వి ప్రభాకర్ రావు, యస్ డి నా సర్ పాషా,మేకల ఈశ్వర్, ఎస్ గట్టయ్య, ఎస్ కుమారస్వామి,జానకి ప్రసాద్,షేక్ అబ్దుల్ రవూఫ్, సిహెచ్ రెడ్డి, వి సుదర్శన్ రావు,వై బుచ్చిరెడ్డి, టంగుటూరి శ్రీనివాస్, కోటపాటి సత్యనారాయణ,కోటి, ఆపరేటర్లు కే బాబూలాల్,మహి వికేందర్, కేశవ స్వామి,ఊకే సమ్మయ్య, శ్రీనివాస్,జనార్ధన్, ఇసాక్, జానీ,ఆకుల కృష్ణారావు, గంగయ్య,ఏ లక్ష్మీనారాయణ, ప్రతాప్ రెడ్డి,అర్జున్ రావు,, యాకయ్య,జానీ ఐ శంకర్, ఈశ్వరయ్య,కుత్బుద్దీన్, ఎం నాగరాజు,సుధాకర్,రాజేంద్రప్రసాద్, తాజుద్దీన్ శాంతయ్య, నిర్మల్, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పదవీ విరమణ సింగరేణి కార్మికుడికి అధికారుల కార్మిక సంఘాల,సహోద్యోగుల, బంధుమిత్రుల ఘన సన్మానం
by Naddi Sai
Published On: August 1, 2025 8:59 pm