వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో జరిగిన హోటల్ భవనం పైకప్పు కూలిన ఘటనలో గాయపడిన వారిని తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పరామర్శించారు.
ఈ ప్రమాదంలో నలుగురు బాధితులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.
సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చందన (12), తండ్రి చాద్రు, రమేష్ (25), తండ్రి నరసింహులు లను స్పీకర్ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
స్పీకర్, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్, డీఎం అండ్ హెచ్ ఓ లలితా దేవిలను సూచిస్తూ, బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
అనంతరం గోకుల్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎం. డి. నజీర్ (17) మరియు బాలాజీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎం. శివకుమార్ (25)లను కూడా స్పీకర్ పరామర్శించారు.












