పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడిలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో దోమల బెడదతో నిద్రపోయే ముందు వెలిగించిన దోమల కాయిల్ వల్ల జరిగిన అగ్నిప్రమాదంలో నాగేశ్వరరావు (58) అనే వ్యక్తి సజీవదహనమయ్యారు.
నిద్రపోతున్న సమయంలో నాగేశ్వరరావు దుప్పటికి నిప్పురవ్వ అంటుకోవడంతో మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో ఆయన సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
స్థానికులు ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా దోమల కాయిల్ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణలో వెల్లడికానున్నాయి.
ఈ విషాదకర సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.











